Showing posts with label 01.05.ప.వేమన పద్యాలు 21 to 30. Show all posts
Showing posts with label 01.05.ప.వేమన పద్యాలు 21 to 30. Show all posts

01.05..వేమన పద్యాలు 21 to 30

వేమన పద్యాలు (21–30)

21.
అల్పబుద్ధి వాని అధికారమిచ్చిన,
దొడ్డవారినెల్ల దొలగజేయు,
చెప్పుందినెడి కుక్క చెరుకు తీపెరుగునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
22.
అల్పుడైనవాని అధిక భాగ్యముగల్ల,
దొడ్డవారి దిట్టి దొలగొట్టు,
అల్పబుద్ధి మొప్పె యధికుల నెరుగునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
23.
ఎద్దుకైనగాని ఏడాది తెలిసిన,
మాట దెలిసి నడచు మర్మమెరిగి,
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన,
విశ్వదాభిరామ వినుర వేమా.
24.
ఎలుకతోలు దెచ్చి యేడాది ఉతికిన,
నలుపు నలుపేగాని తెలుపురాదు,
కొమ్మబొమ్మ తెచ్చి కొట్టిన బలుకునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
25.
పాముకన్న లేదు పాపిష్టిజీవంబు,
అట్టిపాము చెప్పినట్లు వినును,
ఖలుని గుణము మాన్పు ఘనులెవ్వరునులేరు,
విశ్వదాభిరామ వినుర వేమా.
26.
వేము పాలు వోసి ప్రేమతో బెంచిన,
చేదు విరిగి తీపి జెందబోదు,
ఓగునోగెగాక యుచితజ్ఞు డెటులౌను,
విశ్వదాభిరామ వినుర వేమా.
27.
ముష్టి వేపచెట్టు మొదలంట ప్రజలకు,
బరగ మూలికలకు పనికివచ్చును,
నిర్దయాత్మకుండు నీచుడెందులాకౌను,
విశ్వదాభిరామ వినుర వేమా.
28.
పాలు పంచదార పాపర పండ్లలో,
చాలపోసి వండ చవికి రాదు,
కుటిల మానవులకు గుణ మేల గల్గురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
29.
పాల నిడిగింట గ్రోలుచుండేనా,
మనుజులెల్ల గూడి మధ్యమండ్రు,
నిలువదగని చోట నిలువ నిందలువచ్చు,
విశ్వదాభిరామ వినుర వేమా.
30.
కానివాని తోడు కలిసి మెలుగుచున్న,
గానివాని వలె కాంతురవని,
తాడి క్రింద బాలు తాగిన చందమౌ,
విశ్వదాభిరామ వినుర వేమా.
విశ్వదాభిరామ వినుర వేమా

CONCEPT ( development of human relations and human resources )